: తెలుగమ్మాయికి ప్రతిష్ఠాత్మక అవార్డు... 'రైటర్స్' పురస్కారం అందుకోనున్న తొలి భారతీయురాలు

పరిశోధక విభాగంలో ఇచ్చే ప్రతిష్ఠాత్మక జేమ్స్ క్లర్క్ మాక్స్‌ వెల్ 'రైటర్స్' అవార్డుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన విద్యార్థిని వరం శ్రీదేవి ఎంపికయ్యారు. ఈ రీసెర్చ్ అవార్డుకు ఎంపికైన తొలి భారతీయ విద్యార్థిని శ్రీదేవి కావడం విశేషం. బ్రిటన్ కు చెందిన జేమ్స్ క్లర్క్ మాక్స్‌ వెల్ ఫౌండేషన్ ప్రతి ఏటా ఈ అవార్డును ప్రకటిస్తుంది. 'స్ట్రైన్ రేట్ సెన్సిటివిటీ' అంశంపై ఆమె జరిపిన పరిశోధనకు ఈ గుర్తింపు లభించింది. ఈ రీసెర్చ్ పేపర్ 'ఫిలసాఫికల్ మేగజైన్ లెటర్స్’ జర్నల్‌ లో కూడా ప్రచురితమైంది.

More Telugu News