: గాయంతో రేపటి మ్యాచ్ కు షమీ దూరం... బిన్నీ, భువీల్లో ఒకరికి చాన్స్!

టీమిండియా పేసర్ మహ్మద్ షమీ మోకాలి గాయం కారణంగా శనివారం యూఏఈతో జరిగే మ్యాచ్ కు దూరమయ్యాడు. షమీ ఎడమ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడని, చికిత్స తీసుకుంటున్నాడని, రేపటి మ్యాచ్ కు అందుబాటులో ఉండడని బీసీసీఐ మీడియాకు తెలిపింది. కాగా, షమీ వైదొలగిన నేపథ్యంలో, ఆల్ రౌండర్ స్టూవర్ట్ బిన్నీ, యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ లలో ఒకరికి చాన్స్ దక్కనుంది. అయితే, భువీ ఫిట్ నెస్ పై సందేహాలు ఉండడంతో కెప్టెన్ ధోనీ ఫాంలో ఉన్న బిన్నీ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News