: లోక్ సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీ
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో 2014-15 ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు. 2014-15లో వృద్ధిరేటు 7.4 శాతంగా ఉంటుందని, 2015-16లో వృద్ధిరేటు 8 నుంచి 10 శాతంగా ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.
* ద్రవ్య స్థిరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
* ఆదాయం పెంచేందుకు ప్రాధాన్యం
* 2014-15లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 257.07 మిలియన్ టన్నులుగా అంచనా
* రెండంకెల వృద్ధిరేటు సాధ్యమే
* 14వ ఆర్థిక సంఘం ఆర్థిక సమాఖ్య విధానాన్ని అవలంభించింది
* 2016లో ద్రవ్యోల్బణం 5 నుంచి 5.5 శాతానికి పరిమితం అవుతుంది
* ఏప్రిల్-జనవరిలో ఆహార రాయితీ ధర రూ.1.07 లక్షల కోట్లు
* మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా మధ్య సమతుల్యం పాటించాలి
* బ్యాంకింగ్, బీమా, ఫైనాన్స్ విభాగాల్లో సంస్కరణలు అవసరం
* కరెంటు ఖాతా లోటు 1.3 శాతంగా ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా
* ప్రతి వ్యక్తికి జన్ ధన్, ఆధార్, మొబైల్ నంబర్ కల్పిస్తే కష్టాలు తీరుతాయి
* అర్హులకు ఫలాలు అందాలంటే జన్ ధన్, ఆధార్, మొబైల్ నంబర్ అవసరం