: యాదగిరి లక్ష్మీనరసింహుడికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్
నల్లగొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన లక్ష్మీనరసింహుడి కల్యాణ మహోత్సవం ఈ సాయంత్రం జరగనుంది. ఈ క్రమంలో లక్ష్మీనరసింహ స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం సతీమణి కూడా పాల్గొన్నారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు గట్టి భద్రత చేపట్టారు. కొంత అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు... దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీని కూడా అనుమతించలేదు. అటు భక్తులను కూడా గుట్టపైకి అనుమతించడంలేదు.