: నువ్వు లేకుంటే ఆత్మహత్యే... ఇన్ స్టాగ్రామ్ లో పోస్టింగ్ చూసి స్పందించిన అందాల నటి

మైమరపించే గానం, మత్తెక్కించే కళ్ళు ఆమె సొంతం. ఆ అందమే 22 ఏళ్ల సెలీనా గోమేజ్ కు అభిమానుల్లో విపరీతమైన క్రేజును, కొన్ని కష్టాలనూ తెచ్చిపెట్టింది. ఎంతగా అంటే "నువ్వు లేకుంటే ఆత్మహత్యే చేసుకుంటాను" అని ఆమె ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టింగ్స్ పెట్టేంత. ఈ మెసేజ్ లు చూసి సెలీనా స్పందించింది. ఆ అభిమానిని 'ఫాలో' అవుతూ అతని ఆలోచనలు మార్చాలని ప్రయత్నిస్తోంది. "ప్రతి జీవితానికీ విలువ ఉంది" అంటూ స్వీయ ప్రొఫైల్ కాప్షన్ మార్చి పలు కొత్త పోస్టింగ్స్ పెట్టింది. "నా వరకూ, నీవెంట పడ్డాను అంటే, నీ ఆలోచనలకు సరేనని చెప్పినట్టు కాదు. నువ్వు చెడు మర్గాన వెళుతున్నావు. నువ్వు మారాలన్న ఉద్దేశంతో నేను నీవెంట నడుస్తున్నా" అని ఆమె ట్వీట్ చేశారు. "నీలా ఆలోచిస్తున్న వాళ్లు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వారిలో కొందరు నీకన్నా బెటర్ అయితే, మరికొందరు వరస్ట్ గా ఉండొచ్చు. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఈ ప్రపంచంలో ఒంటరివి కాదు. ప్రజలు నిత్యం ఎన్నో ఆపుకోలేని భావోద్వేగాలను వ్యక్తం చేస్తుంటారు. నీ ప్రాణాలు తీసుకోవాలని భావించే ముందు నువ్వు ఎన్ని ప్రాణాలు కాపాడావు అన్న విషయం ఆలోచించు. నీకోసం ఒకరు తప్పక ఉంటారు. ఐ లవ్ యు. ఇంకో ముఖ్య విషయం ఏమంటే, దేవుడు నీపై చూపే ప్రేమ ముందు అది దిగదుడుపే" అని ఆ వీరాభిమాని మనసు మార్చేందుకు ప్రయత్నించారు.

More Telugu News