: పార్లమెంటు ముందుకు విభజన చట్టం... నేడు సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సవరణ బిల్లు నేడు పార్లమెంటు ముందుకు రానుంది. యూపీఏ హయాంలో ప్రతిపాదించిన ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు ఏన్డీఏ సర్కారు కొన్ని సవరణలు చేసింది. సవరణలతో కూడిన విభజన బిల్లును నేడు నరేంద్ర మోదీ సర్కారు పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. విభజన చట్టంలో పలు అంశాల్లో తమకు అన్యాయం జరిగిందని అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణ కూడా కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు, చట్టానికి సవరణలు చేయండని విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో కొన్ని అంశాల్లో మార్పులు, చేర్పులు చేసిన విభజన చట్టాన్ని కేంద్రం నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది.