: రైల్వే బడ్జెట్ లో దక్షిణ మధ్య రైల్వేకు రూ.2,768 కోట్లు
రైల్వే బడ్జెట్ లో ఈసారి దక్షిణ మధ్య రైల్వేకు కేంద్రం బాగానే నిధులు కేటాయించింది. మౌలిక సదుపాయాల కల్పన కింద రూ.2,768 కోట్లు ప్రకటించింది. గతేడాది కంటే 24 శాతం ఎక్కువగా నిధులు కేటాయించింది.
* పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ కొత్తలైన్ నిర్మాణానికి రూ.141 కోట్లు
* మరోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ కు రూ.20 కోట్లు
* మేళ్లచెరువు-విష్ణుపురం రైల్వే లైన్ కు రూ.100 కోట్లు
* నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వేలైన్ కు రూ.130 కోట్లు
* నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ కు రూ.110 కోట్లు
* విజయవాడ-భీమవరం-నిడదవోలు లైను డబ్లింగ్. విద్యుదీకరణకు రూ.150 కోట్లు
* సికింద్రాబాద్, మహబూబ్ నగర్ లైన్ డబ్లింగ్ పనులకు రూ.1200 కోట్లు
* ప్యాసింజర్ సదుపాయాలకోసం రూ.29 కోట్లు
* రూ.29 కోట్ల వ్యయంతో ఐదు కొత్త పనులు మంజూరు
* రైల్వే వంతెనల నిర్మాణానికి రూ.1,587 కోట్లు
* 38 కొత్త రైల్వే వంతెనలు మంజూరు