: శ్రీవారి ఆలయం ముందు సిలువ గుర్తు... తిరుమలలో కలకలం

దేవదేవుడు కొలువైన తిరుమలలో అన్యమత ప్రచారంపై నిషేధం ఉన్నా, ఇటీవలి కాలంలో అన్యమత ప్రచారం పెరుగుతుండటం భక్తులను బాధిస్తోంది. తాజాగా, శ్రీవారి ఆలయం ముందే సిలువ గుర్తు కనిపించడంతో కలకలం రేగింది. ఇక్కడ వున్న ఓ సిమెంట్ దిమ్మెపై ఉన్న గుర్తు శ్రీవారి భక్తులను ఆందోళనకు, ఆగ్రహానికి గురిచేసింది. అయితే, ఈ విషయంలో అధికారుల వాదన మరోలా ఉంది. అది సిలువ గుర్తు కాదని ప్లస్ గుర్తని టీటీడీ వర్గాలు అంటున్నాయి. అంతకుముందు శ్రీవారి ఆలయం ముందున్న నాదనీరాజనం మండపం సమీపంలో ఓ సిమెంట్ దిమ్మెపై సిలువ గుర్తు ఉన్న విషయాన్ని భక్తులు, స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని మీడియాకు అందించారు. ఇది ఇతర మతస్థుల పనేనని భక్తులు కన్నెర్ర చేస్తున్నారు. ఆ దిమ్మెపై సిలువ గుర్తును వేసి ఆ ప్రాంతానికి తీసుకువచ్చి పెట్టారా? లేక అక్కడున్న దిమ్మెపైనే చెక్కారా? అన్న విషయంపై స్పష్టత రాలేదు.

More Telugu News