: చంద్రబాబుతో సింగపూర్ మంత్రి షణ్ముగం భేటీ... జూన్ లోగా నవ్యాంధ్ర రాజధాని మాస్టర్‌ప్లాన్
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎలా ఉండాలో తెలిపే మాస్టర్‌ప్లాన్ జూన్ లోగా సిద్ధం కానుంది. ఈ విషయాన్ని సింగపూర్ మంత్రి షణ్ముగం నేడు తెలిపారు. అంతకుముందు ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో సమావేశమయ్యారు. కొత్త రాజధానిని వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళిక ఇస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఏపీని ప్రమోట్ చేసేందుకు గోపీనాథ్ పిళ్లైని తమ ప్రభుత్వం నియమించినట్లు వివరించారు. ఏపీ ప్రభుత్వ పనితీరు చూసే పెట్టుబడిదారులు వస్తున్నారని తెలిపారు. పట్టణాభివృద్ధిలో బాబు సర్కారు నైపుణ్యం చూసే, రాజధానిని రూపొందించే పనిని స్వీకరించామని ఆయన తెలిపారు.