: మూడు నెలల శిశువు గొంతుకోసిన కన్నతల్లి
నవమాసాలు మోసి కన్న బిడ్డను కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన కన్నతల్లి కనీసం కడుపులో మోసినన్ని రోజులు కూడా క్షేమంగా వుండనీయలేదు. భర్తతో గొడవల కారణంగా, నిండా మూడు నెలలు కూడా నిండని బిడ్డ గొంతు కోసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం గాడ్లగూడెంలో జరిగింది. మూడు నెలల శిశువు గొంతుకోసి తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఈ ఘటనను గుర్తించిన చుట్టుపక్కలవారు తల్లీ, బిడ్డలను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. భర్తతో గొడవలే ఆత్మహత్యాయత్నానికి కారణమని బంధువులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు.