: ఆస్కార్ గ్రహీత, కెనడియన్ సౌండ్ మిక్సర్ కు కమల్ అభినందనలు
కెనడియన్ సౌండ్ మిక్సర్, తాజాగా 'విప్ లాష్' చిత్రానికి ఆస్కార్ పురస్కారం పొందిన క్రైగ్ మన్ నటుడు కమల్ హాసన్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తన బృందం అవార్డు పొందినట్టుగా భావిస్తున్నానని పేర్కొన్నారు. కమల్ నటించిన 'ఉత్తమ్ విలన్'కు క్రైగ్ పనిచేశాడు. ఈ నేపథ్యంలో స్పందించిన కమల్, "మన సినిమా 'ఉత్తమ్ విలన్'కు మంచి సౌండ్ మిక్సింగ్ చేయాలని సౌండ్ డిజైనర్ కునాల్ నేను అడిగాను. అప్పుడతను క్రైగ్ మన్ ను తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయనకు ఆస్కార్ వచ్చినందుకు ఆనందిస్తున్నా. ఇందుకు గర్వంగా ఉంది. ముందు ముందు ఆయన మరింత వర్క్ చేయాలని కోరుకుంటున్నా" అని పేర్కొన్నాడు.