: పక్కవాడి తలనీలాలు ఇస్తానని నువ్వెలా మొక్కుతావ్?: కేసీఆర్ పై అరుణ నిప్పులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యక్తిగతంగా దేవుడికి మొక్కులు మొక్కుకొని, వాటిని తీర్చేందుకు ప్రజాధనాన్ని వినియోగిస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. అసలు దేవుడి మొక్కులకు ప్రజాధనాన్ని ఎలా ఖర్చు పెడతారని విమర్శించారు. డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్‌ వ్యవహార శైలి సొంత మొక్కుల కోసం పక్కవాడి తలనీలాలు సమర్పించినట్టు ఉందని ఎద్దేవా చేశారు. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించే డబ్బును సొంత మొక్కులకు వాడుతుంటే చూస్తూ ఊరుకోబోమని తెలిపారు. దేవుళ్ల మధ్య కూడా ఆయన తారతమ్యాలు చూపుతున్నాడని అరుణ విమర్శించారు.

More Telugu News