: రామ్ ప్యారీ... దొంగిలించడానికి వచ్చిన వ్యక్తిని చంపేసింది!

ఆగ్రాకు సమీపంలోని నాగ్లా మణి గ్రామంలో ఓ గేదె తనను అపహరించేందుకు వచ్చిన దొంగను హతమార్చింది. ఈ గేదె సత్యప్రకాశ్ అనే వ్యక్తికి చెందినది. దానికి అతడు 'రామ్ ప్యారీ' అని పేరు కూడా పెట్టుకున్నాడు. సోమవారం ఉదయం లేచి చూసేసరికి తన ఇంటి ముందు జనం గుమిగూడి ఉండడాన్ని గమనించాడు సత్యప్రకాశ్. బయటికి వచ్చి చూడగా, పశువుల పాక వద్ద ఓ వ్యక్తి కళేబరం పక్కనే 'రామ్ ప్యారీ' ఉంది. తనను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయడంతో అతడిని చంపేసింది. ఆ దొంగ చేయి పలుపుతాడుకు చిక్కుకుపోగా, అలాగే అతడిని దాదాపు రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. దీంతో, ఛాతీ, తల, ఉదరంపై గాయాలవడంతో ఆ చోరుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అతడు ఎవరన్నది తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. ఇప్పుడా గేదెను గ్రామస్థులు యముడి వాహనంగా పిలుచుకుంటున్నారు.

More Telugu News