: నేపాల్ మంత్రి కొడుకునంటూ, మహిళా ప్రొఫెసర్ పై విద్యార్థి అత్యాచారం

ఢిల్లీలోని ప్రముఖ యూనివర్సిటీల్లో ఒకటైన జవహర్ లాల్ నెహ్రు వర్శిటీలో దారుణం జరిగింది. యూనివర్సిటీలోని మహిళా ప్రొఫెసర్ పై ఓ పీహెచ్ డీ విద్యార్థి అత్యాచారం చేశాడు. తాను నేపాల్ కు చెందిన మంత్రి కొడుకునని, మెరుగైన ఉద్యోగం పొందేందుకు సహాయం చేస్తానని నమ్మబలికి లైంగికంగా వేధించాడని, అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ విద్యార్థిని అరెస్ట్ చేశారు. నిందితుడిని పాటియాలా కోర్టులో ప్రవేశపెట్టి, ఆపై కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.

More Telugu News