: ఇతర జట్లలో భయం పుట్టించిన గేల్: బ్రియాన్ లారా

జింబాబ్వేతో జరిగిన క్రికెట్ పోటీలో క్రిస్ గేల్ విధ్వంసం ఇతర జట్లలో భయాన్ని పుట్టించేలా ఉందని, గేల్ ఇన్నింగ్స్ తో చాలా జట్లు వెస్టిండీస్ అంటే భయపడుతున్నాయని దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా వ్యాఖ్యానించాడు. నిన్నటి పోటీలో అద్భుతరీతిలో రాణించిన గేల్ డబుల్ సెంచరీని కొట్టిన సంగతి తెలిసిందే. "ఇదొక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్. తొలి 100 పరుగులను నిదానంగా సాధించిన గేల్ ఆపై ఏ బంతిపైనా జాలి చూపకుండా బాదాడు. మొత్తం ఆటను తన చేతుల్లోకి తీసుకున్నాడు. గేల్ ఆట చూసేందుకు ఆసక్తిని చూపా" అని లారా అన్నాడు. గేల్ మంచి ఫాంలోకి రావడంతో తమ దేశానికి వరల్డ్ కప్ అవకాశాలు మెరుగుపడ్డాయని ఆయన అభిప్రాయపడ్డాడు. శామ్యూల్స్ సైతం పక్కాగా ఆడి గేల్ కు సహాయంగా నిలిచాడని పొగిడాడు.

More Telugu News