: స్విస్ ఖాతాలో 7.6 మిలియన్ డాలర్లు దాచుకున్న హెచ్ఎస్ బీసీ చీఫ్!
నల్లధనం వివాదంతో పెను విమర్శల్లో చిక్కుకున్న హెచ్ఎస్ బీసీని కాపాడతానంటూ ఆ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టువర్ట్ గలివర్ ప్రకటించారు. ఓ బ్యాంకు అధిపతిగా మంచి ప్రకటనే చేశారుగా, ఇందులో విశేషమేముందనుకుంటున్నారా? బ్రిటన్ కు చెందిన సదరు బ్యాంకుకు సంబంధించి ఆ దేశ పత్రిక గార్డియన్ నిన్న ఓ సంచలనాత్మక కథనాన్ని రాసింది. బ్యాంకుపై పడ్డ ‘బ్లాక్’ మార్కులు చెరిపేస్తానని ప్రకటించిన గలివర్ పైనే పెద్ద మచ్చ ఉందని ఆ పత్రిక బాంబు పేల్చింది.
గలివర్ పేరిట ఉన్న స్విస్ ఖాతాలో 7.6 మిలియన్ డాలర్ల మేర సొమ్ముందట. ఈ కథనంపై గలివర్ నోరు మెదపలేదు. ఉద్యోగ జీవితంలో అందిన బోనస్ లను దాచుకునేందుకే గలివర్ స్విస్ ఖాతాను వినియోగిస్తున్నారని ఆయన ప్రతినిధి వెల్లడించారు. గార్డియన్ కథనంపై హెచ్ఎస్ బీసీ కూడా ఏమాత్రం స్పందించలేదు.