: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు: రఘువీరారెడ్డి
ఢిల్లీలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ నేతల సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. సమావేశానికి కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, శాసనమండలితో కాంగ్రెస్ పక్ష నేత సి.రామచంద్రయ్య తదితరులు హాజరయ్యారు. ఏపీ ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అంశంపై చర్చించారు. అనంతరం మీడియాతో రఘువీరా మాట్లాడుతూ, ఈ సాయంత్రం 4 గంటలకు మరోసారి సమావేశమవుతామని చెప్పారు. ఎంపీలు, మాజీ ఎంపీలు పార్లమెంటు గాంధీ విగ్రహం ఎదురుగా ధర్నా చేస్తారని తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, సాధించేవరకు పోరాడతామని స్పష్టం చేశారు.