: మెల్ బోర్న్ లో భారీ వర్షం... ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయిన టీమిండియా

ఆస్ట్రేలియా నగరం మెల్ బోర్న్ ఎయిర్ పోర్టులో టీమిండియా జట్టు సభ్యులు చిక్కుకుపోయారు. నిన్న మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన ధోనీ సేన, తదుపరి మ్యాచ్ కోసం ఆ దేశంలోని మరో నగరం పెర్త్ కు నేటి ఉదయం బయలుదేరింది. ఉదయం నుంచి మెల్ బోర్న్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. వర్షం నేపథ్యంలో విమాన సర్వీసులన్నీ రద్దయ్యాయి. దీంతో పెర్త్ వెళ్లేందుకు అప్పటికే ఎయిర్ పోర్టు చేరుకున్న టీమిండియా సభ్యులు విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు.

More Telugu News