: యోగా అత్యాచారాలను తగ్గిస్తుంది: బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి

దేశంలో నానాటికి పెరిగిపోతున్న అత్యాచారాలను తగ్గించేందుకు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి ఓ కొత్త మార్గాన్ని సూచించారు. ‘ద అయ్యంగార్ వే... యోగా ఫర్ ద న్యూ మిల్లీనియం’ పేరిట నిన్న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా... యోగా అత్యాచారాలను తగ్గిస్తుందని ఆయన చెప్పారు. ‘‘సామాన్యుడి జీవితంలోకి యోగా ప్రవేశిస్తే, నిత్యం జరుగుతున్న అత్యాచారాల సంఖ్య తగ్గుతుంది. యోగా విస్తృతమైతే, దేశంలో అత్యాచారాలు పూర్తిగా తగ్గకపోయినా, వాటి సంఖ్య క్రమంగా తగ్గడం మాత్రం ఖాయం. పురుషులు, మహిళల ఆలోచనా దోరణిని యోగా పూర్తిగా మార్చేస్తుంది. అంతేకాక, శారీరక అవసరాలను కూడా మార్చేస్తుంది. ప్రకృతి మానవుడికి ఓ పెద్ద పనిని అప్పజెప్పింది. యోగాతో సదరు పనివైపు మనం మళ్లిపోతాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

More Telugu News