: ఆ సెంటిమెంటు నిజమైంది...అభిమానులూ మీకు ధన్యవాదాలు: శిఖర్

శిఖర్ ధావన్ సెంచరీ చేస్తే టీమిండియా విజయం సాధిస్తుందనే సెంటిమెంట్ మరోసారి నిజమైంది. గత మూడు వరల్డ్ కప్ పోటీల్లో సాధ్యం కాని విజయాన్ని టీమిండియా ఈసారి సాధ్యం చేసింది. గతంలో జరిగిన వరల్డ్ కప్ పోటీల్లో పోటీ పడ్డ ప్రతిసారీ సౌతాఫ్రికాను వరించిన విజయం ఈసారి మాత్రం భారత్ ను వరించింది. 130 పరుగుల భారీ తేడాతో సఫారీ జట్టును టీమిండియా చిత్తుచేసింది. 137 పరుగులు చేసిన ధావన్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. జట్టు విజయం సాధించిన అనంతరం ధావన్ మాట్లాడుతూ, జట్టును విజయ పథాన నిలపడమే ప్రతి ఆటగాడి కర్తవ్యమని అన్నాడు. తాను నిలదొక్కుకోవాలని భావించానని, నిలదొక్కుకుంటే పరుగులు వాటంతట అవే వస్తాయని అనుకున్నానని, అలాగే జరిగిందని అన్నాడు. తొలి వికెట్ తొందరగా పడిపోవడంతో ఒత్తిడిలో పడిన జట్టును కోహ్లీతో నిలబెట్టే ప్రయత్నం చేయగా, రహానేతో ఇన్నింగ్స్ నిర్వహించానని అన్నాడు. వరల్డ్ కప్ లో ఇదే తరహా ప్రదర్శనలు మరిన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని ధావన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. తమను ప్రోత్సహించేందుకు వచ్చిన అభిమానులకు ధన్యవాదాలని తెలిపాడు.

More Telugu News