: ఆంధ్రా, తెలంగాణ సమస్యలను గుర్తించాం: వెంకయ్యనాయుడు
ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, నిధుల కేటాయింపులపై టీడీపీ, వైఎస్సార్సీపీ, బీజేపీ ఎంపీలు అడిగారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. పార్లమెంటులో అఖిల పక్షం సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్ లో విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీల మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కసరత్తు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. పునర్విభజన బిల్లులో పేర్కొన్న ప్రతి హామీని నెరవేర్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.