: రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

దక్షిణాఫ్రికా జట్టు రెండో వికెట్ కోల్పోయింది. 308 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టు జాగ్రత్తగా ఆడుతోంది. నాలుగో ఓవర్ లో తొలి వికెట్ కోల్పోయిన సఫారీలు 11వ ఓవర్ లో రెండో వికెట్ కోల్పోయారు. డీప్ మిడ్ వికెట్ మీదుగా బౌండరీ తరలించాలని ఆమ్లా కొట్టిన షాట్ ను షమీ అద్భుతమైన రీతిలో ఒడిసిపట్టడంతో రెండో వికెట్ కోల్పోయారు. దీంతో 22 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద ఆమ్లా పెవిలియన్ బాటపట్టాడు. దీంతో డుప్టెసిస్ కు కెప్టెన్ డివిలీర్స్ జత కలిశాడు. డివిలీర్స్ ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. కాగా, సౌతాఫ్రికా జట్టు 16 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. డుప్లెసిస్ 15 పరుగులతో ఆడుతుండగా, డివిలీర్స్ 14 పరుగులు సాధించాడు.

More Telugu News