: ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా?... అయితే ఇది మీ కోసమే!


ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా?... అయితే మీరు చదవాల్సిందే. పట్టణ ప్రాంతాల్లోని యువతరం ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా చెవుల్లో ఇయర్ ఫోన్స్ దర్శనమిస్తున్నాయి. వాకింగ్ కు వెళ్లినా, జాగింగ్ కు వెళ్లినా, ప్రయాణం చేసినా, పని చేస్తున్నా ప్రతి ఒక్కరూ ఇయర్ ఫోన్స్ తో సావాసం చేస్తున్నారు. ఇది ప్రమాదకరం అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని నేషనల్ పార్క్ సర్వీసెస్ సహకారంతో సైంటిస్ట్ కర్ట్ ఫ్రిస్టప్ టీం ఇయర్ ఫోన్స్ వాడకంపై ఓ అధ్యయనం నిర్వహించారు. ఇందులో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. ఇయర్ ఫోన్స్ వాడకం పెరిగే కొద్దీ ఇతరులతో మసలుకునే స్వభావం తగ్గిపోతుందట. దీంతో ఒంటరితనం పెరిగిపోతుందట. ప్రశాంతత కూడా దూరమవుతుందట. ఇయర్ ఫోన్స్ వాడకం కారణంగా సహజమైన ప్రకృతి కిలకిలారావాలు ఆస్వాదించలేమట. అన్నింటికంటే ముఖ్యమైనది చెవుడు తొందరగా వస్తుందట.

  • Loading...

More Telugu News