: మాకు ఏ పదవులూ వద్దు... పార్టీని బలోపేతం చేయండి: టీ టీడీపీ నేేతలతో నారా లోకేష్
‘‘ఏపీలో మా నాన్న సీఎం అయ్యారు. తెలంగాణలో సీఎం అయ్యే అవకాశమే లేదు. తెలంగాణ నుంచి పోటీ చేయాలన్న ఆలోచనే నాకు లేదు. తెలంగాణలో మేము ఎలాంటి పదవులనూ ఆశించం. ఇక్కడ అధికారం మీదే. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయండి. ఇక్కడ మీ రక్షణ, కార్యకర్తల సంక్షేమం కోసమే మా తపన. అందుకే నాన్న తెలంగాణలో పర్యటిస్తున్నారు’’ అని ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయుడు, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ అన్నారు. ఎన్టీఆర్ భవన్ లో నిన్న టీ టీడీపీ నేతలు ఎల్. రమణ, మోత్కుపల్లి నర్సింహులు, కరీంనగర్ జిల్లా నేతలతో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతమైతే, ఇక్కడి వారికే పదవులు దక్కుతాయని ఆయన వారికి చెప్పుకొచ్చారు.