: అమెరికా ఉపాధ్యక్షుడి వెకిలి చేష్టలు... డిఫెన్స్ సెక్రటరీ భార్య భుజాలపై చేతులేసి గుసగుసలు
మహిళల భుజాలపై చేతులేసి మాట్లాడుతూ వివాదాలు రేపుతున్న అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ మరోమారు తన వెకిలి చేష్టలతో కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు. అమెరికా రక్షణ శాఖ డిఫెన్స్ సెక్రటరీగా పదవీ ప్రమాణం చేస్తున్న ఆష్ కార్టర్ సమక్షంలోనే ఆయన భార్య పట్ల బిడెన్ అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. ఆష్ భార్య స్టెఫానీ భుజాలపై బిడెన్ చేతులేశారు. అంతటితో ఆగని ఆయన ఆమె మెడ మీదుగా వంగి చెవిలో గుసగుసలాడారు. బిడెన్ చర్యతో తన భార్య పడుతున్న ఇబ్బందిని గమనించిన కార్టర్, ఆమెను తన వైపు లాగేశారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లోని రూజ్వెల్ట్ రూంలో గత మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.