: సికింద్రాబాద్ టీడీపీ నేతల మూకుమ్మడి రాజీనామా

బూత్ లెవల్ నుంచి రాష్ట్ర నాయకుల వరకు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మూకుమ్మడి రాజీనామాలు చేసినట్టు టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్.బాల్‌రాజ్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తలసాని ప్రైవేట్ సెక్రటరి పవన్‌కుమార్ గౌడ్‌తో పాటు అన్ని డివిజన్లు, నగర నేతల్లో మరింతమంది రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. త్వరలో కార్యచరణను రూపొందించుకుని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ ఆధ్వర్యంలో ఆబ్కారీ మంత్రి పద్మారావు సమక్షంలో టీఆర్‌ఎస్‌ లో చేరనున్నట్టు తెలిపారు. కాగా, తమ నేత తలసాని టీఆర్‌ఎస్‌ లో చేరినందువలనే వీరంతా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News