: మల్లికా శెరావత్ సినిమాలో కేజ్రీవాల్ కు అవకాశం!... తిరస్కరించిన ఆప్ అధినేత

ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారే గెలుపొందిన ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు తక్కువ సమయంలోనే ఎంతో పాప్యులారిటీ వచ్చింది. ఈ క్రమంలో ఆయనకు సినీ సెలబ్రిటీలు సైతం అభిమానులయ్యారు. అలా కేజ్రీ మొదటిసారి ఢిల్లీ సీఎం అయినప్పుడు శృంగారతార మల్లికా శెరావత్ నటించిన 'డర్టీ పాలిటిక్స్' చిత్రంలో జర్నలిస్టు పాత్ర పోషించే అవకాశం వచ్చిందట. కానీ కేజ్రీ సున్నితంగా తిరస్కరించారట. అప్పుడే పార్టీని స్థాపించడం, తరువాత సీఎం అవడంతో సమయాభావంవల్ల నిరాకరించినట్టు సమాచారం. దాంతో తరువాత ఆ పాత్రలో నటుడు నసీరుద్దీన్ షాను తీసుకున్నారట.

More Telugu News