: కనకదుర్గమ్మకు భక్తులిచ్చిన మంగళ సూత్రం అపహరణ
అమ్మలగన్న అమ్మ నగలనే చోరీ చేద్దామని భావించి అడ్డంగా దొరికిపోయాడో ప్రబుద్ధుడు. కనకదుర్గ ఆలయ హుండీ లెక్కింపులో ఒక ఒప్పంద ఉద్యోగి చేతివాటం చూపించాడు. ఈ ఉదయం విజయవాడలో గుడి హుండీ లెక్కింపులో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది. లెక్కింపులో భాగంగా హుండీ నుంచి బంగారు మంగళసూత్రాలు, నానుతాడును ఉద్యోగి చోరీ చేసినట్టు ఆలయ అధికారులు గమనించారు. నిందితుడిని పట్టుకొని వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై ఈఓ ఆదేశాల మేరకు ఆలయ అధికారులు సైతం విచారణ మొదలుపెట్టారు.