: మారణహోమంతో అంతర్మథనంలో లాడెన్... ఆల్ ఖైదా పేరు మార్పుపై తర్జనభర్జన: అమెరికా
ఒసామా బిన్ లాడెన్... కరడుగట్టిన తీవ్రవాదిగా చిరపరితుడు. అమెరికాను వణికించి, ఆ దేశ సైనికుల దాడిలోనే అంతమయ్యాడు. అయితే, తన నేతృత్వంలోని ఆల్ ఖైదా కొనసాగిస్తున్న మారణహోమంతో ఒకానొక సమయంలో అతడు అంతర్మథనంలో కూరుకుపోయాడట. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ తో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో ఆల్ ఖైదా వరుస దాడుల నేపథ్యంలో అతడు ఆలోచనలో పడ్డాడట.
దాడుల కారణంగా వచ్చిన చెడ్డ పేరును చేరిపేసుకునేందుకు ఏకంగా ఆల్ ఖైదా పేరును కూడా మార్చాలనుకున్నాడట. అమెరికా సైనికుల చేతిలో హతమయ్యేందుకు కొద్దిరోజుల ముందుగా ఈ దిశగా ఆలోచన చేసిన అతడు, తన ముఖ్య అనుచరులతో సమాలోచనలు కూడా చేశాడట. అయితే దీనిపై నిర్ణయం తీసుకునేలోగానే అమెరికా లాడెన్ ను మట్టుబెట్టింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నెస్ట్ నిన్న ఈ విషయాలను వెల్లడించారు.