: యువకుడిని కటకటాల్లోకి పంపిన ఫేస్ బుక్ సెల్ఫీ!
వన్యప్రాణులను హింసించరాదన్న నిబంధనలను తుంగలోతొక్కి, అత్యుత్సాహంతో తాబేలు పైకి ఎక్కి చిత్రాలు తీసుకుని, వాటిని ఫేస్ బుక్ లో ఉంచిన యువకుడు ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు. చాంద్రాయణగుట్ట జహనుమాకు చెందిన ఫజల్ షేక్ (24) గత ఏడాది మేలో నెహ్రూ జూపార్కును సందర్శించాడు. జంతు సంరక్షకులు లేని సమయంలో తాబేలుండే ప్రదేశంలోకి దూకి దానిపై నిలబడి ఫోటోలు తీసుకున్నాడు. అదే సమయంలో నిప్పు కోడి, ఈము పక్షులు ఉండే ఎన్ క్లోజర్లలోకి ప్రవేశించి వాటికి ఆహారాన్ని అందిస్తున్నట్లు చిత్రాలు తీసుకుని, వాటిని ఫేస్ బుక్ లో పెట్టాడు. వీటిని చూసిన జూపార్కు అధికారులు ఓ యువతి ఫోటోను ఫేస్ బుక్ ద్వారా నిందితుడికి పంపి అతడి వివరాలు, అడ్రసును కనుక్కున్నారు. జూపార్కు క్యూరేటర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, బుధవారం అర్ధరాత్రి ఫజల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.