: పెద్దల సభకు ఎన్టీఓ నేత దేవీ ప్రసాదరావు... టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ బరిలోకి!
తెలంగాణ ఉద్యమం, కొత్త రాష్ట్ర ఏర్పాటు... ఉద్యోగ సంఘాలకు చెందిన పలువురు కీలక నేతలను ప్రజాప్రతినిధులుగా మార్చేశాయి. స్వామి గౌడ్, శ్రీనివాసగౌడ్ లు ఈ జాబితాలో ముందున్నారు. తాజాగా టీఎన్జీఓ అధ్యక్షుడు దేవీ ప్రసాదరావును పెద్దల సభకు పంపేందుకు టీఆర్ఎస్ నిర్ణయించింది. నేడు వెలువడనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దేవీ ప్రసాదరావు దిగేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది.
గడచిన సార్వత్రిక ఎన్నకల్లోనే రాజకీయాల్లోకి రావాలని భావించినా, ఆర్థిక కారణాలతో నాడు ఆయన వెనకడుగేశారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా ఆయనపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కూడా సరేననడంతో ఆయన తన ఉద్యోగ ప్రస్థానానికి ఫుల్ స్టాప్ పెట్టనున్నారు. ఈ నెల 25లోగా తన ఉద్యోగానికి రాజీనామా చేయనున్న ఆయన ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు.