: కాకినాడలో మందుబాబుల వీరంగం... బీరు సీసాల దాడిలో కొత్త జంటకు తీవ్ర గాయాలు
తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ శివారులో రాత్రి పొద్దుపోయిన తర్వాత మందుబాబులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తు తలకెక్కిన మందుబాబులు కొత్త జంటపై దాడి చేశారు. సెకండ్ షో సినిమా చూసి ఇంటికెళుతున్న దంపతులపై బీరు సీసాలతో దాడి చేసి, వారి వద్దనున్న నగదు, నగలను దోచుకున్నారు. ఈ దాడిలో కొత్త జంటకు తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ శివారులోని కొత్తపల్లి మండలం చెవిటివారిపాకంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయాలపాలైన దంపతులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.