: తప్పుడు ఆరోపణ చేశారుగా... క్షమాపణ చెప్పండి: బీజేపీని కోరిన ఆప్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ‘సామాన్యుడి పార్టీ’ ఆమ్ ఆద్మీ పార్టీ, వారానికే మరో ఆసక్తికర విజయాన్ని నమోదు చేసింది. తనపై ఆరోపణలు చేసిన పార్టీ నుంచే... 'అబ్బబ్బే, అలాంటిదేమీ లేదులెండి' అంటూ క్లీన్ చిట్ దక్కించుకుంది. వివరాల్లోకెళితే, ఎన్నికల ఖర్చుల కోసం విదేశాల నుంచి భారీ ఎత్తున నిధులను నిబంధనలకు విరుద్ధంగా సేకరించిందని ఆప్ పై కేంద్రంలో అధికారంలోని బీజేపీ ఆరోపించింది. దీనిపై కోర్టుకెక్కిన బీజేపీ నేతలు ఆప్ కు నోటీసులు జారీ చేయించారు. తాజాగా ఆప్ కు అందిన చందాల్లో ఎలాంటి పొరపాటు జరగలేదని స్వయంగా బీజేపీ ఆధ్వర్యంలోని నరేంద్ర మోదీ సర్కారు కోర్టుకు చెప్పింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో మీడియా ముందుకు వచ్చిన ఆప్, బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ‘‘మీరు చేసిన ఆరోపణలను, మీరే ఖండించారుగా. అంటే మేం తప్పు చేయలేదని ఒప్పుకున్నట్లేగా. మరి క్షమాపణలు ఎవరు చెబుతారు?’’ అంటూ ఆ పార్టీ నేత అశుతోశ్ నిన్న బీజేపీ నేతలను ప్రశ్నించారు.

More Telugu News