: అధికార మదంతో విర్రవీగితే... పరాభవం తప్పదు: టీఆర్ఎస్ పై కాంగ్రెస్ కుంతియా ధ్వజం
టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యపై టీఆర్ఎస్ సర్కారు వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియా ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు అసంబద్ధ నిర్ణయాలపై నిరసనలు చేయడం ప్రతిపక్షాల బాధ్యత అని, అంతమాత్రాన పోలీసులతో కిరాతకంగా దాడి చేయించడం సబబు కాదని ఆయన అన్నారు.
పోలీసుల దురుసు ప్రవర్తన కారణంగా గాయపడ్డ పొన్నాలను కుంతియా మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం ఉంది కదా అని విర్రవీగితే, పరాభవం తప్పదని ఆయన టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. అధికార మదంతో రెచ్చిపోతే, ఢిల్లీలో బీజేపీకి పట్టిన గతే టీఆర్ఎస్ కూ తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. పోలీసుల దురుసు ప్రవర్తనకు కేసీఆర్ సర్కారే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.