: లెఫ్టినెంట్ గవర్నర్ ను కలిసిన కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఆయన గవర్నర్ ను కలవడం వెనుక ఆంతర్యం తొందర్లోనే పరిపాలన పగ్గాలు చేపడతామని చెప్పడమే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను 67 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే.