: మంచి వేదిక దొరికితే రాజకీయాల్లోకి వస్తా: మల్లికా శెరావత్

బాలీవుడ్ భామ మల్లికా శెరావత్ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతోంది. మంచి వేదిక దొరికితే రాజకీయాల్లోకి రావడం ఇష్టమేనని చెబుతోంది. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేస్తున్న వర్కే తనను ప్రోత్సహించిందని మల్లిక తెలిపింది. చాలా గొప్పగా తన జాబ్ నిర్వర్తిస్తున్నారని, తనేకాక జాతి మొత్తం ఆయన చేస్తున్న దానికి ఆకర్షితమవుతుందని అంటోంది. "నాకు మంచి ప్లాట్ ఫాం దొరికితే, దాని ద్వారా రాజకీయాల్లో చేరతాను. మన సమాజంలో మహిళలకు నేను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నా. రాజకీయాల్లోకి వస్తే నేను చేయాలనుకున్నది చేస్తా" అని మల్లిక వెల్లడించింది.

More Telugu News