: మల్లికార్జునపురం గ్రామాన్ని దత్తత తీసుకున్న టీడీపీ నేత సోమిరెడ్డి

టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం మల్లికార్జునపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ గ్రామాన్ని ఎంపిక చేసుకున్నానని తెలిపారు. ప్రధాని ఇచ్చిన పిలుపు దేశాభ్యుదయానికి ఎంతో ఉపకరిస్తుందని పేర్కొన్నారు. గ్రామాల దత్తతపై ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించాలని సోమిరెడ్డి సూచించారు. ప్రధాని ఇచ్చిన పిలుపు అందుకుని ఎందరో ప్రముఖులు, నేతలు గ్రామాలను దత్తత తీసుకోవడం తెలిసిందే. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు కండ్రిగ (పీఆర్ కండ్రిగ) గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. గ్రామాన్ని సందర్శించి అక్కడ చేపట్టాల్సిన పథకాలపై అధికారులతో చర్చించాడు.

More Telugu News