: బీజేపీకి చంద్రబాబు భయపడుతున్నారు: రఘువీరా
ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ పార్టీ రూ. 5 లక్షల కోట్ల ప్యాకేజీ ఇస్తే, బీజేపీ, టీడీపీలు రెండూ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాయని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన ప్యాకేజీని సాధించడంలో, నిధులను రాబట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపించారు. బీజేపీకి ఆయన భయపడుతున్నారని... ఆ పార్టీకి భయపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాష్ట్రానికి రెవెన్యూ లేదని ప్రజలను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఒక అడుగు కూడా ముందుకు వెళ్లడం లేదని విమర్శించారు. విభజనచట్టంలోని హామీలను నెరవేర్చాలని కోరుతూ ఈనెల 23న ప్రధాని మోదీని కలుస్తామని అన్నారు.