: బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యానాథ్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ యోగి ఆదిత్యానాథ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అవకాశమిస్తే ప్రతి మసీదులో గౌరి-గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠిస్తానని అన్నారు. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) నిర్వహించిన 'విరాట్ హిందూ సమ్మేళన్'లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. హిందుస్థాన్ లో అందరినీ హిందువులను చేస్తామని ఆదిత్యానాథ్ అన్నారు. ప్రతి ఒక్కరూ కాశీ రావొచ్చని... కానీ మక్కా, మదీనాలో కేవలం ముస్లింలనే అనుమతిస్తారని పేర్కొన్నారు. భారత్ లోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఇది హిందుత్వ శతాబ్దమని బీజేపీ ఎంపీ పేర్కొన్నారు.

More Telugu News