: రాజ్యసభ సభ్యత్వం కోసం రూ.100 కోట్ల ఖర్చు... ఇందుకు బాటలేసింది తెలుగు నేతలే: సీతారాం ఏచూరి

రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే రూ.100 కోట్లు కావాల్సిందేనని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు. ఈ తరహా రాజకీయ బేరాలకు బాటలు వేసింది తెలుగు రాజకీయ నేతలేనని ఆయన అన్నారు. విజయవాడలో సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. నేతల ఈ తరహా చర్యలపై ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీల నేతలు వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారని ఆయన అన్నారు. ఇంతటి భారీ ఖర్చు పెట్టి ఎన్నికల్లో ఎలా పోటీ చేయగలమని కూడా ఢిల్లీలో నేతల మధ్య చర్చలు జరుగుతుంటాయని ఏచూరి చెప్పారు.

More Telugu News