: ఘర్ వాపసీ ఆగదు: ‘బెంగళూరు’ వీడియో ప్రసంగంలో ప్రవీణ్ భాయ్ తొగాడియా

విశ్వ హిందూ పరిషత్ చీఫ్ ప్రవీణ్ భాయ్ తొగాడియా ఘర్ వాపసీపై మరోమారు గళమెత్తారు. దేశంలో అన్యమతాల్లోకి వెళ్లిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకొచ్చేదాకా ‘ఘర్ వాపసీ’ ఆగదని ఆయన వ్యాఖ్యానించారు. విశ్వ హిందూ పరిషత్ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని నిన్న బెంగళూరులో విరాట్ హిందూ సమాజోత్సవ్ పేరిట నిర్వహించిన సభలో వీహెచ్ పీ నేతలు పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించి 15 నిమిషాలతో కూడిన తొగాడియా ప్రసంగాన్ని ప్రదర్శించారు. ఈ వీడియో ప్రసంగంలో ఘర్ వాపసీ కొనసాగుతుందని పునరుద్ఘాటించిన తొగాడియా, దేశాన్ని రాజ్యంగబద్ధ హిందూ దేశంగా ప్రకటించి తీరతామని తెలిపారు.

More Telugu News