: పాక్ జట్టులోకి నసీర్ జంషెద్
ఐసీసీ వరల్డ్ కప్ లో ఆడనున్న పాకిస్థాన్ జట్టులోకి స్టాండ్ బై ఆటగాడిగా నసీర్ జంషెడ్ వచ్చాడు. అతనిని జట్టులోకి తీసుకునేందుకు ఐసీసీ ఈవెంట్ టెక్నికల్ కమిటీ అంగీకరించింది. పాకిస్థాన్ వరల్డ్ కప్ జట్టులో స్ధానం సంపాదించిన హపీజ్ సయీద్ గాయాల పాలవ్వడంతో అతని స్థానంలో నసీర్ జంషెడ్ ను తీసుకున్నారు. దీంతో పాక్ బ్యాటింగ్ ఆర్డర్ లో సమతూకం ఏర్పడిందని ఆ జట్టు భావిస్తోంది. కాగా నసీర్ జంషెడ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తూ ఓపెనర్ గా ఆడతాడు, రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ గా కూడా రాణించాడు.