: తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్... బిన్నీ బౌలింగ్ లో ఫించ్ ఔట్

భారత్ తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆదిలోనే వికెట్ కోల్పోయింది. డేవిడ్ వార్నర్ తో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఆరోన్ ఫించ్(20), టీమిండియా బౌలర్ స్టువర్ట్ బిన్నీ బౌలింగ్ లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే, వార్మప్ మ్యాచ్ లో ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ బ్యాట్స్ మన్ 13.2 ఓవర్లలోనే సెంచరీ పూర్తి చేశారు. వచ్చీరాగానే బ్యాట్ ఝుళిపించిన డేవిడ్ వార్నర్ 51 బంతుల్లోనే 65 పరుగులు చేశాడు. ఫించ్ వెనుదిరగడంతో క్రీజులోకొచ్చిన ఆసీస్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ (17) కూడా ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 14 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టానికి 107 పరుగులు చేసింది.

More Telugu News