: తిరుమలలో కొబ్బరికాయల కొరత... కర్పూరంతో సరిపెట్టుకుంటున్న భక్తులు

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కొబ్బరికాయల కొరత ఏర్పడింది. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కొబ్బరికాయలు కొట్టడం ఆనవాయతీ. అయితే, కొబ్బరికాయలకు కొరత ఏర్పడడంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరికాయల కౌంటర్ల వద్ద దర్శనమిస్తున్న 'నో స్టాక్' బోర్డులు భక్తులను వెక్కిరిస్తున్నాయి. మొక్కులు తీర్చుకునే క్రమంలో కొబ్బరికాయలు కొట్టకపోవడం ఆచార విరుద్ధమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి కర్పూరం వెలిగించి సరిపెట్టుకుంటున్నట్టు తెలిపారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన తమకు తిరుమలలో ఇలాంటి పరిస్థితులు ఎదురవడంతో భక్తులు అసంతృప్తి చెందుతున్నారు. దీనిపై టీటీడీ అధికారుల స్పందన తెలియరాలేదు.

More Telugu News