: ఎవరు ఫిట్ అవుతారో?... ఎవరు క్విట్ అవుతారో?

వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో కీలక ఆటగాళ్లు గాయాలబారిన పడడం బీసీసీఐని కలవరపరుస్తోంది. అందుకే, టోర్నీ ఆరంభానికి ముందే వారికి ఫిట్ నెస్ టెస్టు నిర్వహించాలని నిర్ణయించింది. రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా తదితరులకు నేడు ఫిట్ నెస్ టెస్టు నిర్వహిస్తున్నారు. ఫిట్ నెస్ నిరూపించుకోలేకపోతే ఇంటికి పంపుతారు. ఇక, ఫిట్ గా ఉన్నట్టు తేలిన ఆటగాళ్లను రేపు ఆసీస్ జట్టుతో జరిగే వార్మప్ మ్యాచ్ లో ఆడించడం ద్వారా వారి మ్యాచ్ సన్నద్ధతను కూడా పరీక్షిస్తారు. అనంతరమే పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ కు తుది జట్టును ప్రకటించాలని భావిస్తున్నారు. వరల్డ్ కప్ పోటీలు ఫిబ్రవరి 14 నుంచి ఆరంభం కానుండగా, ఆ మరుసటి రోజే అడిలైడ్ ఓవల్ లో దాయాదుల సమరం జరగనుంది. ఈ మ్యాచ్ కు టిక్కెట్లన్నీ ఎప్పుడో అమ్ముడైపోయిన సంగతి తెలిసిందే.

More Telugu News