: ముస్లింలు అందరూ ఆప్ కు ఓటేయాలి: జామా మసీదు ఇమామ్ 'బుఖారీ'
ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచాం... కానీ, ఈ సారి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయాలంటూ ఢిల్లీలోని జామా మసీదు ఇమామ్ 'సయ్యద్ అహ్మద్ బుఖారీ' ముస్లింలకు పిలుపునిచ్చారు. మతతత్వ బీజేపీని ఓడించి, సెక్యులరిజాన్ని కాపాడాలంటే... ప్రస్తుత పరిస్థితుల్లో కేజ్రీవాల్ కు ఓటేయక తప్పదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితిలో లేదని... అందువల్ల కాంగ్రెస్ కి ఓటేసినా వృథా అవుతుందని బుఖారీ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేయాలని బుఖారీ పిలుపిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 'ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్', పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత, సీపీఎం జనరల్ సెక్రటరీ ప్రకాశ్ కారత్ లు కూడా ఆప్ కు మద్దతు పలికారు. ఢిల్లీ అసెంబ్లీకి రేపు పోలింగ్ జరుగుతుండగా, 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.