: జమ్ము కాశ్మీర్ ఎన్నటికీ పాక్ ది కాబోదు... ఎప్పటికీ కాదు కూడా: భారత్

జమ్ము కాశ్మీర్ ను కలుపుకునేందుకు పాక్ చేస్తున్న ప్రయత్నాలపై భారత్ ఏదో ఒక ప్రకటన చేస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చాలా ధీమాగా మాట్లాడారు. 'కాశ్మీర్ సాలిడారిటీ డే' పేరుతో పాక్ లో పాటించడంపై వెంటనే స్పందించారు. జమ్ము కాశ్మీర్ ఎన్నటికీ పాక్ ది కాబోదని... ఎప్పటికీ కాదు కూడా అని స్పష్టం చేశారు. పాక్ 'స్వీయ విధ్వంసక', భూభాగాన్ని పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నం అందరికీ తెలిసిందే అని అన్నారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, పాక్ లో జమాత్ ఉద్ దవా నిర్వహించిన ర్యాలీలు, ప్రసంగాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సయ్యద్ పైవిధంగా మాట్లాడారు.

More Telugu News