: మాజీ 'మిస్ ఆంధ్రా' విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం... ఆర్థిక ఇబ్బందులే కారణమా?

మాజీ 'మిస్ ఆంధ్రా' విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేసింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించిన ఆమె ఉదంతం ఖమ్మంలో కలకలం రేపింది. ఆత్మహత్యాయత్నం చేసిన విజయలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి ఆర్థికపరమైన సమస్యలే కారణమై ఉంటాయన్న వాదన వినిపిస్తోంది. తన సోదరుడితో నెలకొన్న ఆస్తి తగాదాలతో విసిగిపోయిన విజయలక్ష్మి బలవన్మరణానికి యత్నించిందని తెలుస్తోంది. తన అందచందాలతో 'మిస్ ఆంధ్రా' కిరీటాన్ని సొంతం చేసుకున్న విజయలక్ష్మిపై గతంలో యాసిడ్ దాడి జరిగింది.

More Telugu News