: సినీ నిర్మాత అట్లూరి రామారావు కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మరో ప్రముఖ వ్యక్తి కన్నుమూశారు. నటుడిగా, నిర్మాతగా సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన అట్లూరి రామారావు (90) ఈ ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పంజాగుట్ట హిందీనగర్ లో ఉన్న రుషిసారథి అపార్ట్ మెంట్ లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రామోజీ గ్రూపులో భాగమైన ఉషాకిరణ్ మూవీస్ లో అట్లూరి రామారావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా పని చేశారు.

More Telugu News