: కిందపడ్డ జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే

జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కిందపడ్డారు. ఇటీవలే ఆఫ్రికా యూనియన్ ఛైర్మన్ గా ఎన్నికైన రాబర్ట్ ముగాబే, జింబాబ్వే రాజధాని హరారేలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మెట్టు దిగుతూ తడబడిన ఆయన కిందపడ్డారు. 90 ఏళ్ల ముగాబే కిందపడడంతో భద్రతా సిబ్బంది ఆయనను పైకిలేపారు. అనంతరం ఆయన కారులో అక్కడి నుంచి నిష్క్రమించారు. దేశాధ్యక్షుడు మెట్టు దిగుతూ కిందపడడంతో అది హాట్ టాపిక్ గా మారింది.

More Telugu News